Skip to content

ఎందుకింత ప్రేమ నాపై | Endukintha Prema Naapai Song Lyrics Telugu

Endukintha Prema Naapai Song Lyrics in Telugu

పల్లవి: ఇశ్రాయేలును….. ఇశ్రాయేలును….. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు మమ్ము కాపాడిన మా దేవా – ఇదియే మా జిహ్వార్పణ
|| 2 ||

అనుపల్లవి: ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్య ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెదా
|| 2 ||

1.ఇన్నాళ్లకైనా…. ఫలములు కాయకున్న నాకై నీవిచ్చిన… వనరులే వ్యర్ధమైన
ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని
‌ || 2 ||
విజ్ఞాపనము చేయుచున్న ప్రధాన యాజక
|| 2 ||
|| ఎందుకింత||

  1. గోతిలోనికి దిగిన… మన్ను నిన్ను స్తుతించునా గళమెత్తి పాడగలనా…. మృతుల లోకానా?
    సజీవులు సజీవులే నిన్ను స్తుతియించెదరు
    || 2 ||
    ఈ కంఠము మూగబోకముందే ఆరాధించెదా
    || 2||
    || ఎందుకింత||

3.నిరీక్షణే లేక… కలవరము చెందగా అడుగులు తడబడగా – ఆప్తులే దూరమైన

వాత్సల్య కటాక్షములు – ఎంతో ఉన్నతమై
|| 2 ||
గొప్ప కార్యములు నా యెడల చేసియున్నావు
|| 2 ||
|| ఎందుకింత||
‌ || ఇశ్రాయేలు||

Endukintha Prema Naapai Video Song Telugu Christian