Skip to content

Yogyuda Song Lyrics Telugu – Sushanth Karem

Yogyuda Song Lyrics in Telugu

పల్లవి:
మహిమోన్నతుడా.. మహోపకారుడా
మరణాన్ని గెలిచినవాడ .. మహా దేవుడా

ఆశ్చర్యకారుడా .. ఆల్ఫా ఒమేగా
అద్భుతాలు చేయువాడా.. ఆది అంతం అయ్యుంనవాడా

ఈ సృష్టి అంత నీ మహిమతో నిండి యున్నది..
సర్వ జీవరాసులు నీ మాటకు లోబడుచున్నవి..

ఎన్ని తరాలు మారిన నీ మాట మారదు
ఎన్ని యుగాలు గడిచిన నీ వాగ్దానం మారిపోదు

యోగ్యుడా … యోగ్యుడా ..
స్తుతులపై ఆసీనుడా

ఆరాధ్యుడా తేజోమయుడా
ఆరాధనకు అర్హుడా …. || 2 ||

చరణం :
వేవేల దూతలతో కొనియాడబడుచున్న
సుందరుడా..
ఆకాశమునే సింహాసనముగా
ఆసీనుడవైన బలశూరుడా || 2 ||

ఎలుగెత్తి నీ కొరకే నే పాడెద
స్తుతి కీర్తన

నీ కృప వల్లనే నాకు జీవమని
చాటిచెప్పేదా అనునిత్యము

యోగ్యుడా … యోగ్యుడా ..
స్తుతులపై ఆసీనుడా

ఆరాధ్యుడ తేజోమయుడా
ఆరాధనకు అర్హుడా …. || 2 ||

చరణం :
మంటినయ్య నా తలెనెతుట్టకు
బయపడచున్నాను పరిశుద్దుడా
ఏ యోగ్యత లేని అల్పుడనైనా
నాలాంటి వాని కొరకు బలీయవైనావు || 2 ||

నీ శిలువే శరణం అని ప్రకటించెద సువార్తను
నీ బాటే మోక్షమని నే సాగేద నీ సాక్షిగా

యోగ్యుడా … యోగ్యుడా ..
స్తుతులపై ఆసీనుడా

ఆరాధ్యుడ తేజోమయుడా
ఆరాధనకు అర్హుడా …. || 2 ||

Yogyuda Video Song Telugu Christian