Skip to content

నీకేమి చెల్లింతు | Neekemi chellinthu song lyrics telugu

Neekemi chellinthu song lyrics telugu

పల్లవి : నీకేమి చెల్లింతునయ్యా – సిలువలో నీవు
చూపిన ప్రేమకై “2 సార్లు “
మాటలతో ప్రకటించనా – పాటలతో
ఘనపరచనా “2 సార్లు “
ఆత్మతో ఆరాధించన – నా యేసయ్యా
ఆత్మతో ఆరాధించనా “2 సార్లు “
“నీకేమి “

2 చ : నరులను ప్రేమించి – వారి పాపము
క్షమియింప
పరమును విడిచి – ఇల భువికేతెంచావు
“2 సార్లు “
రిక్తుడిగా వచ్చి – దాసుడవైన యేసయ్యా
“2 సార్లు “
దాసుడవైనా – యేసయ్యా
“ఆత్మ “

2 చ: సిలువను మోసి – దాని విలువను
మార్చావు
కలువరి గిరిని – రక్షణ గిరిగా మార్చావు
“2 సార్లు “
పాపినైన నన్ను మార్చి – నా గతిని
చూపిన యేసయ్యా “2 సార్లు “
నా గతిని చూపిన – యేసయ్యా
“ఆత్మ “

3 చ: పాపము భరియించి – మా శాపము
తొలగించ
సిలువలో రక్తము కార్చి – మము
రక్షించావు “2 సార్లు”
నిత్యమూ జీవించే – నిరీక్షణ ఇచ్చిన
యేసయ్యా “2 సార్లు”
నిరీక్షణ ఇచ్చిన – యేసయ్యా
“ఆత్మ “

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now