Skip to content

ఎన్ని తలచినా ఏది అడిగినా | Enni Talachina Edi Adigina Song Lyrics Telugu

Enni Talachina Edi Adigina Song Lyrics Telugu

ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే ప్రభువా //2//
నీ వాక్కుకై వేచియుంటిని
నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా //2//

1.నీ తోడు లేక నీ ప్రేమ లేక
ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2)
అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2)
నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా ||ఎన్ని||

2.నా ఇంటి దీపం నీవే అని తెలసి
నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2)
ఆరిపోయిన నా వెలుగు దీపము (2)
వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా ||ఎన్ని||

3.ఆపదలు నన్ను వెన్నంటియున్నా
నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2)
లోకమంతయూ నన్ను విడచినా (2)
నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా ||ఎన్ని||