Skip to content

నీ ప్రేమలో ప్రయాణమే | Nee Premalo Prayaname Lyrics Telugu

Nee Premalo Prayaname Song Lyrics in Telugu

నీ ప్రేమలో ప్రయాణమే

నీ ప్రేమలో ప్రయాణమే – నీ బాటలో ప్రభాతమే
నీవేగా ఆశ్రయం – నీలోనే జీవితం
సజీవుడా పదే పదే నే పాడి కీర్తించనా
సదా నిన్ను కొనియాడనా
నీ ప్రేమలో ప్రయాణమే – నీ బాటలో ప్రభాతమే
ప్రేమామయా నా యేసయ్య – నా ప్రాణమే నీవేనయా

  1. నీ మాటలే వెన్నంటే సాగెనే – విడువనీ నీ కృపా నన్నెంతో కాచెనే
    ప్రతీ మలుపు నీ సాక్ష్యమే – ప్రతీ శ్వాస నీ స్వాస్థ్యమే
    సహించేటి నీ ప్రేమతో – మన్నించేటి నా దైవమా
    కన్నీటిలో, కష్టాలలో – నడిపించె నీ వాక్యమే
    దయామయా – కృపామయా – నీవే సదా తోడుగా
    నా త్రోవలో నీడగా
  2. నీ స్నేహమే వరించే సొంతమై – మదిలో నీ స్వరం వసించే దీపమై
    ఎన్నెన్నో తరంగాలలో – కృంగించేటి గాయాలలో
    నిన్నే కోరే నా వేదన – నిన్నే చేరే నా ప్రార్ధన
    చుక్కానివై , సహాయమై – దరి చేర్చే నీ ప్రేమతో
    దయామయా – కృపామయా – నీ ప్రేమయే చాలయా
    నా గమ్యమే నీవయా

Nee Premalo Prayaname Song Details

SongNee Premalo Prayaname | నీ ప్రేమలో ప్రయాణమే
MusicPranam Kamlakhar
LyricsJoshua Shaik
SingerYasaswi Kondepudi
Telugu Christian Songs Lyrics 2023

Nee Premalo Prayaname Telugu Christian Song Lyrics