Nee Premalo Prayaname Song Lyrics in Telugu
Telugu Lyrics
నీ ప్రేమలో ప్రయాణమే
నీ ప్రేమలో ప్రయాణమే – నీ బాటలో ప్రభాతమే
నీవేగా ఆశ్రయం – నీలోనే జీవితం
సజీవుడా పదే పదే నే పాడి కీర్తించనా
సదా నిన్ను కొనియాడనా
నీ ప్రేమలో ప్రయాణమే – నీ బాటలో ప్రభాతమే
ప్రేమామయా నా యేసయ్య – నా ప్రాణమే నీవేనయా
- నీ మాటలే వెన్నంటే సాగెనే – విడువనీ నీ కృపా నన్నెంతో కాచెనే
ప్రతీ మలుపు నీ సాక్ష్యమే – ప్రతీ శ్వాస నీ స్వాస్థ్యమే
సహించేటి నీ ప్రేమతో – మన్నించేటి నా దైవమా
కన్నీటిలో, కష్టాలలో – నడిపించె నీ వాక్యమే
దయామయా – కృపామయా – నీవే సదా తోడుగా
నా త్రోవలో నీడగా - నీ స్నేహమే వరించే సొంతమై – మదిలో నీ స్వరం వసించే దీపమై
ఎన్నెన్నో తరంగాలలో – కృంగించేటి గాయాలలో
నిన్నే కోరే నా వేదన – నిన్నే చేరే నా ప్రార్ధన
చుక్కానివై , సహాయమై – దరి చేర్చే నీ ప్రేమతో
దయామయా – కృపామయా – నీ ప్రేమయే చాలయా
నా గమ్యమే నీవయా
Nee Premalo Prayaname Song Details
Song | Nee Premalo Prayaname | నీ ప్రేమలో ప్రయాణమే |
Music | Pranam Kamlakhar |
Lyrics | Joshua Shaik |
Singer | Yasaswi Kondepudi |