NAA NEETHI SURYUDA Song Lyrics Telugu
Telugu Lyrics
నా నీతి సూర్యుడ ఉదయించి నాలోన
వెలిగించి హృదయాన్ని వెలుగుగ మార్చుమ ||2||
స్తుతిపాత్రుడ యేసయ్య యేసయ్య
స్తోత్రార్పణ నీకే తగునయా ||2||
నా నీతి సూర్యుడ ఉదయించి నాలోన
వెలిగించి హృదయాన్ని వెలుగుగ మార్చుమ
- మనుష్యుని నీతి క్రియలు మురికి గుడ్డల వంటివి
నరుని హృదయ ఆలోచనలు అపవిత్రమైనవి
నీ మార్గము చూపించి నీ చెంతకు నడిపించి ||2||
నీ నీతితొ నను నింపి నీ దర్శనమియ్యుమయ ||2|| స్తుతిపాత్రుడ యేసయ్య యేసయ్య
స్తోత్రార్పణ నీకే తగునయా ||2|| నా నీతి సూర్యుడ ఉదయించి నాలోన
వెలిగించి హృదయాన్ని వెలుగుగ మార్చుమ ||2|| - పరిసయ్యుని స్వనీతి ప్రార్ధన దేవుని మెప్పించలేదు
హృదయమున గర్వించి పాపముతొ మిగిలిపోయెను
సుంకరి ప్రార్ధన నేర్పి తగ్గింపు మనసును ఇచ్చి ||2||
నీ నీతిని పొందుకొనే హృదయమును ఇయ్యుమయా ||2|| స్తుతిపాత్రుడ యేసయ్య యేసయ్య
స్తోత్రార్పణ నీకే తగునయా ||2|| నా నీతి సూర్యుడ ఉదయించి నాలోన
వెలిగించి హృదయాన్ని వెలుగుగ మార్చుమ ||2|| - నీతిలేని ఈలోకాన నీతిలేని మనుష్యుల మధ్య
నీ నీతిని చూపించే జీవితమును కలిగియుందును
నీ రక్తముతొ కడిగి నా పాపము తొలగించి ||2||
నీ కృపతో దీవించి నీ నీతిని ఇయ్యుమయా ||2|| స్తుతిపాత్రుడ యేసయ్య యేసయ్య
స్తోత్రార్పణ నీకే తగునయా ||2|| నా నీతి సూర్యుడ ఉదయించి నాలోన
వెలిగించి హృదయాన్ని వెలుగుగ మార్చుమ ||2|| స్తుతిపాత్రుడ యేసయ్య యేసయ్య
స్తోత్రార్పణ నీకే తగునయా ||2|| స్తోత్రార్పణ నీకే తగునయా ||2||