Skip to content

Na Gunde Mandaga Song Lyrics Telugu

Na Gunde Mandaga Song Lyrics in Telugu

పల్లవి :-
నా గుండె మండగా – రాస్తున్నా గీతిక…
అందుడవై వుండక- మారాలి నీవిక…
కారిన కన్నీళ్లు -రాలిన ప్రాణాలు
పోయిన మానాలు సాక్షిగా…

భీకర రోదనలు – భయంకర హింసలు
సజీవ దహనాలకు బదులుగా..

ఓ భారతీయుడా నా సహోదరుడా
మారాలి నీవిక కదలాలి ఆపగా

చరణం :-

అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా
నడిస్తేనే స్వాతంత్రం అన్నావు ఆనాడు నీవు…
ఈనాడు ఆ భరతమాత కన్నతల్లి బిడ్డను పట్టపగలే దిగంబరిగా వీధికీడ్చినావు…

మనసు లేదా నీలాంటి మనుషులు వారు కాదా…?
మనిషివేగా నిన్ను కన్నది భరతమాత కాదా..?

ఓ భారతీయుడా నా సహోదరుడా
మారాలి నీవిక కదలాలి ఆపగా

నా గుండె మండగా – రాస్తున్నా గీతిక

Na Gunde Mandaga Song Video Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now