Skip to content

KANNITITHO NINDINA GUNDETHO SONG LYRICS TELUGU

KANNITITHO NINDINA GUNDETHO SONG LYRICS IN TELUGU

కన్నీటితో నిండిన గుండెతో
అలసిన – సోలిన – కూలిన నేస్తమా ||2||
యేసే.. నిజ రక్షకుడై నిన్ను పిలువగా
యేసే విమోచకుడై నిన్ను పిలువగా ||2||
నీవు రక్షణ పొందేదవు; నీవు విడుదల పొందేదవు విమోచన నొందేదవు నిశ్చయము…||2||

వేదనతో ప్రార్థించిన; హృదయమును కుమ్మరించిన ఆవేదన అనుభవించిన హన్నా జీవితములో.. ||2||
ఆశీర్వాదింపబడెను ఫలభరితముగా మారెను ఆవేదనలన్నీ అదృశ్యమాయెను ||2||
యేసయ్య సన్నిధిలో నీవు మోకరిల్లగా
యేసయ్య సన్నిధిలో కన్నీరు విడువగా ||2||

నీవు రక్షణ పొందేదవు; నీవు విడుదల పొందేదవు విమోచన నొందేదవు నిశ్చయము…||2||

శాపగ్రస్త దేశము నుండి; వాగ్దాన ప్రజలకై తీర్మానం చేసిన రూతమ్మ జీవితములో ||2||
హెచ్చింపునొందెను దీవెనగా తీర్చబడెను
యూదా గోత్రములో ఘనురాలు ఆయెను ||2||
యేసయ్య సన్నిధిలో తీర్మానం చేయగా
యేసయ్య సన్నిధిలో నీవు నమ్మకముంచగా ||2||

నీవు రక్షణ పొందేదవు; నీవు విడుదల పొందేదవు విమోచన నొందేదవు నిశ్చయము… ||2||

KANNITITHO NINDINA GUNDETHO VIDEO SONG TELUGU CHRISTIAN