Kalalonaina Song Lyrics in Telugu
కలలోనైనా అనుకోలేదు నీ కృప నను చేరునని
ఇలలోనైనా కానరాలేదు నీ ప్రేమను మించినది
నా మననెరిగి మమత పంచెను నీ కృప
నా ప్రతి ఆశను నెరవేర్చెను నీ కృప నేనెవరినో నన్ను వెదకి వచ్చెను యేసయ్య నీ కృప
అలసి సొలసిన సమయములోన ఆధారమే లేని జీవితాన
అందరి మీద ఆధారపడితిని ఎందరినో నేను నమ్మితిని
నమ్మిన వారే నా పతనము చూడ కుయుక్తులను ఎన్నో పన్నిననూ
నీ కృపయే కదా నాకై నిలచెను
నీ కృపయే కదా న్యాయము తీర్చెను
నీ కృపయే కదా నన్ను రక్షించెను
నీ కృపయే కదా నన్ను స్థిర పరచెను
మలినమైన జీవితాన శాపమైన నా బ్రతుకున
ఈ లోక లోక ప్రేమలే శాశ్వతం అనుకొని ఈ లోక ప్రేమకై పరితపించితి
ఆ ప్రేమలే నన్ను మరచిన గాని స్వార్థముతో నన్ను విడచినను
నీ కృపయే కదా గాయము కట్టెను నీ కృపయే కదా అభిషేకించెను
నీ కృపయే కదా ప్రత్యేకించెను
నీ కృపయే కదా సేవలో నిలిపెను