Na Thodu Song Lyrics in Telugu
Telugu Lyrics
నా తోడు నీవే దేవా
నా బలము నీవే ప్రభువా
నా ధైర్యం నీవే దేవా
నా క్షేమం నీవే ప్రభువా
కాపాడే దైవం నీవేగా – కనుపాపగ నన్ను కాచేగా
నీ దయలో, నీ కృపలో, నీ ఒడిలో నన్నిలలో
- నాలో కన్నీరే నీవైపే చూడగా
నీవే యేసయ్య సంతోషం నింపగా
నిట్టూర్పు లోయలలో, గాఢాంధకారములో
నీవే నా అండగా నన్ను బలపరచగా
నడిపించే వాక్యం నీవైతివీ
కరుణించే దైవం నీవైతివీ
నీ దయలో, నీ కృపలో - ఎన్నో కలతలే నామదిలో నిండగా
నీవే యేసయ్య నావెంటే ఉండగా
నా భయమును తొలగించి , విశ్వాసము కలిగించి
నీవే నా అండగా నన్ను స్థిరపరచగా
నీవుంటే చాలు నా యేసయ్య
నీ ప్రేమే నాకు చూపావయ్యా
నీ దయలో, నీ కృపలో