Skip to content

నను విడువక ప్రేమించిన | Yesuke Ee Jeevitham Song Lyrics Telugu – John Mangacharyulu

Yesuke Ee Jeevitham Song Lyrics in Telugu

నను విడువక ప్రేమించిన
నా యేసుకే ఈ జీవితం
నను మరువక ఆదరించిన
నా క్రీస్తుతో నే సాగేదన్ (2)

మరణమైన జీవమైన
యేసుకే జీవింతును
హల్లెలూయా గీతాలను
బ్రతుకంతా పాడెదను

చరణం :- 1
ఎడారి స్థితినుండి దయతో
నన్ను వేరు చేసెను
పాడైన నన్ను చూసి
అంటుకట్టి తనలో దాచెను (2)

తన సారమునే ఇచ్చెను
నను నీరుకట్టి పోషించెను (2)
( హల్లెలూయా )

చరణం :- 2
ఎండిపోయిన నా బ్రతుకును
ఫలించెడి కొమ్మగా మార్చెను
నీరుకట్టిన తోటవలె
నాదు బ్రతుకు ధాన్యమాయెను (2)

తన కృపతో ఆవరించెను
నను శ్రేష్ఠునిగా నిలిపేను (2)
( హల్లెలూయా )

చరణం :- 3
చేదైన నా బ్రతుకును
మధురముగా మార్చెను
నిష్ఫలమైన వృక్షమును
ఫలభరితముగా మార్చెను (2)

నా బ్రతుకును నిలబెట్టెను
తన పాత్రగా నను మలచెను (2)
( హల్లెలూయా )

Song Details Yesuke Ee Jeevitham

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now
SongYesuke Ee Jeevitham
LyricsBishop Dr Daniel Paul Ayyagaru
SingerBishop Dr John Mangacharyulu
MusicRev Methuselah Daniel

Yesuke Ee Jeevitham Video Song Telugu Christian