Skip to content

Vithanam Virugakapothe Song Lyrics Telugu – Asher Andrew

Vithanam Virugakapothe Song Lyrics in Telugu

విత్తనం విరుగకపోతే – ఫలించునా (2)
కష్టాలే లేకపోతే – కిరీటమే వచ్చునా
అను పల్లవి :
శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం
శ్రమలయందే ఉత్సాహం – విశ్వానమే నా బలం (2)

  1. పోరాటం దేవునిదైతే – నాకేల ఆరాటం
    విశ్వసించి నిలుచుంటేనే
    ఇస్తాడు విజయ కిరీటం (2)
    గొల్యాతును పుట్టించినదే
    దావీదును హెచ్చించుటకే (2)
    కిరీటం కావాలంటే
    గొల్యాతులు రావొద్దా ? (2)

( శ్రమలే )

  1. సేవించే మా దేవుడు – రక్షించక మానునా
    రక్షించకపోయిన సేవించుట మానము (2)
    ఇటువంటి విశ్వాసమే – తండ్రినే తాకునే (2)
    అగ్నిలోకి ప్రభువేరాగా – ఏదైన హాని చేయునా (2)

( శ్రమలే )

  1. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అధికారులు
    శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి (2)
    ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే (2)
    వాగ్దానం నెరవేరా ఫరోలు రావొద్దా (2)

Vithanam Virugakapothe Video Song Telugu Christian

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now