Velasenule Song Lyrics in Telugu
Telugu Lyrics
వెలసెనులే గగనాన తూర్పుతార – నిశీధిరేయి జాములో
కురిసెనులే జగాన ప్రేమధార – రక్షకుడేసు జన్మలో
క్రిస్మస్ కాంతులే లోకాన వెలిగెనే – ప్రభుయేసే జన్మించగా
కన్యకు పుట్టేనేడు పరిశుద్ధుడే – దీనులు ధన్యులాయెనే
“శుభవార్త దూతదెల్పగ – ఆ గొల్లలే గంతులేసేనే
లోకాన రక్షణానందమే – పరలోకానా సంగీతమాయెనే “
- తరించిపోయే ఆ తూర్పు జ్ఞానులు – తీరాలు దాటి నిను చూడగా
బంగారు సాంబ్రాణి బోళములర్పించి – నమస్కరించి పూజించిరి
రారాజే రక్షకుడై మనకోసం జన్మించెనని - జగాలనేలే జయశీలుడేసే – జీవాధిపతిగా జనియించెనే
శరీరధారై పరిశుద్ధుడేసే – పశుశాలలోన పవళించెనే
జయగీతం పాడి – కీర్తించి కొనియాడెదము - మా పాపభారం భరియించెనే – మా దుఃఖ్ఖ దోషం తొలగించెనే
మన్నించి మమ్ము క్షమియించెనే – కరుణించి మాపై కృపచూపునే
మనసున్న మహారాజై – మా మదిలో ఉదయించెనే