Tolakarivaana Song Lyrics Telugu

Tolakarivaana Song Lyrics in Telugu

కురిసింది తొలకరి వాన నా గుండెలోన (2)
చిరుజల్లులా ఉపదేశమై నీ వాక్యమే వర్షమై (2)
నీ నిత్య కృపయే వాత్సల్యమై
నీ దయయే హెర్మోను మంచువలే (2)

పొంగి పొరలి ప్రవహించే నా జీవితాన
ఆనందించి ఆరాధించెద నా యేసయ్య (2)
|| కురిసింది ||

  1. దూలినై పాడైన ఎడారిగా నను చేయక
    జీవజల ఊటలు ప్రవహింపజేశావు (2)
    కలతల కన్నీళ్లలో కనుమరుగైపోనీయక
    సాక్షి మేఘమై నిరీక్షణగా నిలిచావు (2)
    స్తుతులు స్తోత్రం నీకేనయ్యా దయాసాగరా (2)
    || పొంగి పొరలి ||
  2. నీ మందిర గుమ్మములోని ఊటలతో శుద్ధి చేసి
    నా చీల మండలమునకు సౌందర్యమిచ్చితివి (2)
    నీ సన్నిధిలో నిలిచే భాగ్యము కోల్పోనీయక
    నీ ప్రభావ మేఘముతో సాక్షిగ నను నడిపితివి (2)
    తడిసి మునిగి తేలెదనయ్యా ప్రేమ సాగరా (2)
    || పొంగి పొరలి ||
  3. నా తొలకరి వర్షము నీవై చిగురింపజేసావు
    నా ఆశల ఊహలలో విహరింపజేశావు (2)
    నా కడవరి వర్షము నీవై ఫలింపజేసావు
    నీ మహిమ మేఘములో నన్ను కొనిపోయెదవు (2)
    హర్షధ్వనులతో హర్షించెదను కరుణా సాగర (2)
    || పొంగి పొరలి ||

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top