🎵 ChristianLyrics
← Back to Home

ఎవరేమనుకుంటున్నా | Evaremanukuntunna

Telugu Christian Lyrics Song

lyricist: Bro.SAAHUS PRINCE

Telugu

ఎవరేమనుకుంటున్నా నిన్ను ఆరాధిస్తున్నా

పల్లవి : ఎవరేమనుకుంటున్నా నిన్ని ఆరాధిస్తున్నా

నేనేమైపోతున్న నిన్ను కీర్తిస్తూ ఉన్నా

నిరాశ నిస్పృహలోన నీవైపే చూసున్నా

ఈ లోకపు అలజడిలో నా ఒడి నీవేగా ॥2॥


మదిలో మనశ్శాంతి లేక

మాటకి ఏదో మిగిలి ఉన్న

మతి వీడి ఉన్న నన్ను

మళ్లీ కలిసి మన్నించావే.....

నా కథలో..... ఓ మలుపే తెచ్చావే

నా గుండెలో గొప్ప మార్పే ఇచ్చావే..

యేసయ్యా.. నాకున్నది నీవయ్యా..

యేసయ్యా.. నీవుంటే చాలయ్యా.....


బ్రతుకు బాట బరువుకు ఉన్న

బయటికి ఒకలా బ్రతుకుతున్న

దరిలేని నన్ను చేరి – బ్రమ నుండి వేరు చేసావే ॥2॥

యేసయ్యా... నన్నే భరించావా...

యేసయ్యా... నాకై బలైయవా...

దోషినైనా.. నన్నే ప్రేమించావా.....

దరిలేని.. నన్ను నీ దరి చేర్చావా.....

▶ Watch on YouTube Video