SANNUTHINTHU YESU SWAMI SONG LYRICS IN TELUGU
సన్నుతింతు యేసు స్వామి నిన్ను అనుదినం
నీ మహత్య కార్యములను పాడి వివరింతును
శోధన వేదన కష్ట సమయాన నా తోడుగా నుందువు
ఆశ్చర్య కార్యములు ఆనంద గడియలు ఎన్నడూ మరువను
1.
సమాధిలోనుండి నా ప్రాణము విమోచించియున్నావు
కరుణా కటాక్షములు కిరీటముగా నా కిచ్చియున్నావు
నా దోషములన్నిటిని క్షమియించినావు కరుణా సమృద్ధుడవు
మేలులతో నా హృదయం తృప్తిపరిచావు నీకేమి చెల్లింతును
2.
సజీవ యాగముగా నా శరీరము సమర్పించు కొందును నీకు
ఈ లోక మాదిరిని అనుసరింపక నిను మాత్రమే అనుకరింతును
యేసు నీ పోలికగా మారుట నీ చిత్తమని నేనెరిగి జీవించెదను
నా సిలువను ఎత్తుకుని నీ అడుగు జాడలలో కడవరకు నే
నడిచెదను