Skip to content

Oneness Season 2 Song Lyrics Telugu

Oneness Season 2 Song Lyrics in Telugu

Telugu Christioan Song Lyrics Oneness Season 2 By Ps David Parla Giftson Durai

దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను ||2||
యేసయ్య స్తోత్రము యేసయ్య స్తోత్రము ||2||

తంబూరతోను సితార తోను తండ్రిని స్తుతించెదను ||2||
యేసయ్య స్తోత్రము యేసయ్య స్తోత్రము ||2||

దేవుని యందు నిరీక్షణ ఉంచి
ఆయనను స్తుతించు నా ప్రాణమా ||2||
నీకు సహాయము చేయువాడు
సదా ఆదుకొనువాడు ఆయనే ||2||

ఆధారము ఆదరణ ఆయనలో ||2||

నడిపించు నా నావ నడి సంద్రమున నా దేవా
నవజీవన మార్గమున నా జన్మ తరింప
నడిపించు నా నావ…
నా జీవిత తీరమున నా అపజయ భారమున
నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు
నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప
నా నావలో కాలీడుము నా సేవ జేగోనుము
నడిపించు నా నావ…

యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి
నా జీవిత కాలమేల్లా ప్రియ ప్రభువే నా పరిహారి ||2||
ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో ||2||
ఎన్ని నష్టాలు వాటిళ్ళినా ప్రియ ప్రభువే నా పరిహారి ||2||

అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము
ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసు నామము
యేసు నామము జయం జయము
సాతాన్ శక్తుల్ లయం లయము ||2||
హల్లెలూయా హోసన్నా హల్లెలూయా
హల్లెలూయ ఆమెన్ ||2||

సాతాను పై అధికారమిచ్చును
శక్తి కలిగిన యేసుని నామము ||2||
శత్రు సమూహముపై జయమునిచ్చును
జయశీలుడైన యేసుని నామము ||2||

పరమ జీవము నాకు నివ్వ
తిరిగి లేచెను నాతో నుండ ||2||
నిరంతరము నన్ను నడిపించును
మరలా వచ్చి యేసు కొనిపోవును ||2||
యేసు చాలును… యేసు చాలును…
ఏ సమయమైనా ఏ స్థితికైనా
నా జీవితములో యేసు చాలును

సాతాను శోధనలదికమైన సమ్మసిల్లక సాగి వెళ్లెదను ||2||
లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్లలేదను ||2||
నా దాగు చోటు నీవే – నా ఆశ్రయ దుర్గమా ||2||
నా కేడము కోట నీవే ||2||
నా రక్షణ శ్రుంగమా…
నా దాగు చోటు నీవే – నా ఆశ్రయ దుర్గమా…

ఆ… హా… తారారే………. 🙌

రండి ఉత్సాహించి పాడుదము –
రక్షణ దుర్గము మన ప్రభువే –
మన ప్రభువే మహాదేవుండు –
గణ మహాత్యము గల రాజు –
భూమ్యాగాధపు లోయలలో –
భూదర శిఖరము లాయనవే –
రండి ఉత్సాహించి పాడుదము –
రక్షణ దుర్గము మన ప్రభువే…

రాజాధిరాజు దేవాది దేవుడు
త్వరలో వచ్చుచుండెను ||2||
మన యేసు రాజు వచ్చును
పరిశుద్ధులంజేయుమనలన్ ||2||
ఆహా మనమచట కేగుదము ||2||

నూతన గీతము పాడెదము నా ప్రియుడేసునిలో ||2||
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ||2||

యేసే నా మంచి కాపరి
యేసే నా గొప్ప కాపరి
యేసే నా ప్రధాన కాపరి
యేసే నా ఆత్మ కాపరి
యేసే నన్ను కొన్న కాపరి
యేసే నాలో ఉన్న కాపరి
యేసే నా కన్న కాపరి
యేసే నాలో ఉన్న కాపరి…

యెహోవా నా కాపరి – నాకు లేమీ లేదు
పచ్చిక గల చోట్ల – మచ్చికతో నడుపున్ ||2||
నూనెతో నా తలను – అభిషేకము చేయున్
నా హృదయము నిండి – పొర్లుచున్నది ||2||

నాకెన్నో మేలులు చేసితివే
నీకేమి చెల్లింతును దేవా నీకేమి అర్పింతును ||2||
హల్లెలూయ యేసు నాథా
కృతజ్ఞతా స్తుతులు నీకే ||2||

నాకిక ఆశలు లేవనుకొనగా
నా ఆశ నీవైతివే ఆశలు తీర్చితివే…
నలు దిశల నన్ను భయమావరింప
నా పక్షమందుంటివే నాకబయమిచ్చితివే…
హల్లెలూయ యేసు నాథా
కృతజ్ఞతా స్తుతులు నీకే ||2||

మహోన్నతుడా నీ కృపలోనేను నివసించుట
నా జీవిత ధన్యతై ఉన్నది ||2||
మహోన్నతుడా నీ కృపలోనేను నివసించుట||2||
నా జీవిత ధన్యతై ఉన్నది ||2||

నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా ||2||
యేసుతో గడిపెద యేసుతో నడిచెద ||2||
పరమును చేరగ నే వెళ్ళేదా ||2||
హానోకువలె సాగేదా…

నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏతెంచును ||2||
మహిమాన్వితుడై ప్రభు యేసు
మహీ స్థలమునకు ఏతెంచును ||2||
నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏతెంచును
యేసు ప్రభువును బట్టి మా స్తోత్రమూలు
అందుకుందువనీ స్తుతి చేయుచున్నాము
దేవా నీవే స్తోత్ర పాత్రుడవు
నీవు మాత్రమే మహిమ రూపివి
దేవా నీవే స్తోత్ర పాత్రుడవు…

💞 రమ్మనుచున్నాడు నిన్ను ప్రభుయేసు
వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు
వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు…

✝️ ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ||2||
ఎంత మధురమో యేసుని ప్రేమ…
ఎంత మధురమో నా యేసుని ప్రేమ ||2||

🙌 మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు ||2||
స్తుతి ఘనత మహిమయు ప్రభావము నీకే ప్రభు ||2||

🕊️ ఆరాధన… ఆరాధన… ఆరాధన…ఆరాధన…
నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే…

🙌 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను
నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను
ఆరాధనా…ఆరాధనా…ఆరాధన… ఆరాధన…
నీ మేలులకై ఆరాధన… నీ దీవెనకై ఆరాధన…||2||
ఆరాధన… ఆరాధన… ఆరాధన…ఆరాధన…💞

Oneness Season 2 Video Song Telugu Christian

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now