Skip to content

నిను విడచి ఉండలేనయ్యా | Ninu Vidachi Undalenayya Song Lyrics Telugu

Ninu Vidachi Undalenayya Song Lyrics in Telugu

యేసయ్యా…
నీవే నాకు మార్గము, సత్యము, జీవమయ్యా…..

నిను విడచి ఉండలేనయ్యా…
నీ ప్రేమను మరువలేనయ్యా… (2)
నను ప్రేమించెను…
నను విడిపించెను…
నను దీవించెను…
నను బ్రతికించెను…
అనుక్షణము…రక్షించెను
యేసు – నన్ను
అనుక్షణము… రక్షించెను
నా దేవుడు – గొప్ప దేవుడు..
నా యేసయ్యా- ప్రేమామయుడు (2)
(నిను విడచి)

చరణం:
నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా…
కారు చీకటే నన్ను కమ్మి వేసినా.. (2)
శత్రువులను చెదరగొట్టి – చీకటిని వెలుగు చేసి (2)
ప్రతి క్షణము – కాపాడెను
యేసు నన్ను
ప్రతి క్షణము కాపాడెను….
( నా దేవుడు)

చరణం:
నిందలతో నన్ను క్రుంగదీసినా…
మాటలతో నన్ను గాయపరచినా… (2)
నా చెయ్యిని పట్టుకొని – తన అక్కున చేర్చుకొని (2)
నా గాయము స్వస్థ పరచెను..
యేసు
నా గాయము స్వస్థ పరచెను..
( నా దేవుడు)

చరణం:
కన్న వారే నన్ను విడిచి వేసినా.
కట్టుకున్న వారే నన్ను వదిలి వేసినా… (2)
నా చెయ్యిని విడవ కుండా – నన్ను వదిలేయ కుండా…(2)
అను నిత్యము నాతో ఉండెను.

Ninu Vidachi Undalenayya Video Song Telugu Christian

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now