Ninnu Nenu Keerthinthunu Lyrics in Telugu
నిన్ను నేను కీర్తింతును యేసయ్యా
నీ నామమును ప్రకటింతును “2”
నిన్నా నేడు ఏకరీతిగా ఉన్నావని
నాకు తోడు నీడగ నీవే వుంటావని “2”
IIనిన్ను నేనుII
- శూన్యము నుండి సృష్టిని చేసినావని సృష్టిని పాలించ మమ్ము చేసినావని “2”
పాలించే అధికారం కోల్పోయిన వేళలో పాలించే అధికారం మాకిచ్చుట కొరకై “2”
పరలోకము విడచి మాకై ధరకే ఏతెంచినావనని “2”
IIనిన్ను నేనుII - మా స్వస్థతకై నలుగగొట్టబడినావని ఆఖరి రక్తపు బొట్టును కార్చినావని “2”
మా రక్షణకై ప్రాణం పెట్టినావని మరణమును గెలిచి తిరిగి లేచినావని “2”
సదా కాలం మాతో ఉండ ఆత్మరూపిగానే నీవు ఉన్నావని “2”
IIనిన్ను నేనుII