Nee Snehamu Song Lyrics in Telugu
Telugu Lyrics
నీ స్నేహము నను మనిషిని చేసింది
నా హృదయముకు ప్రేమించుట నేర్పింది.
విలువైన రక్తము నా కొరకు ధారపోసి
నిలువెల్ల నలిగితివా ఈ ఘోరపాపి కొరకు
దోషములన్నీ కడిగి నాలో జీవం నింపివి.
ప్రేమమయుడా ,సర్వోన్నతుడా, మహిమాన్వితుడా, నా యేసయ్య ||2||
|| నీ స్నేహము ||
- నా తల మీద ప్రవహించే సంద్రము వంటివి
బాల్యము నుండి నే చేసిన పాపపు కార్యములు ||2||
నా దుష్కార్యములన్నీ నీ వీపువెనక వేసి
దీవెనగా చేయుటకు నా పాప మంతటిని మరిచావు
|| ప్రేమమయుడా ||
|| నీ స్నేహము || - సాధ్యము కాని కార్యములు నీ దయతో పొందితిని
నీ మేలులు మరచి పశుప్రాయుడనై వీపును చూపితినీ ||2||
నా అవిధేయతలన్నీ నీ వేలితో చెరిపి
నా ఎముకలలో నీ వాక్యము నే అగ్నికణముగా దాచావు
|| ప్రేమమయుడా ||
|| నీ స్నేహము || - మరణము వరకు నీతోనే నే ఉంటానంటినీ
స్థిరముగ నిలిచి నీతో ఉండుట కలగా మార్చితిని ||2||
కుమారుని రక్తముతో హిమమంత తెలుపు చేసి
పరిశుద్ధులలో నను చేర్చుటకు సిలువ కిరణమై వెలిగావు
|| నీ స్నేహము ||