Naalona Neevu Song Lyrics Telugu

Naalona Neevu Song Lyrics in Telugu

ప : నాలోన నీవు నేలోన నేను కలకాలం నిలవాలని
ఆశించుచున్నది నా మది నిత్యము నీతోనే గడపాలని (2)
నివు లేక క్షణమైనా నేనుండలేను ప్రభువా నా ప్రభువా (2)

  1. నా గానం నా ధ్యానం నీవే దేవా
    నా ప్రాణం నా సర్వం నీవే ప్రభువా (2)
    మలినమైన నా హృదిని మార్చింది నీవే
    నూతనమగు సృష్టిగా చేసింది నీవే (2)
    ప్రభువా నా దేవా ఈ స్తితికే ఆధరమా (2) (నాలోన నీవు)
  2. వేదనలో ఆదరణ నీవే దేవా
    ఒంటరినై వున్నప్పుడు జతనీవే ప్రభువా (2)
    పనికిరాని నా బ్రతుకును చూసింది నీవే
    ఉన్నతమగు స్థానానికి చేర్చింది నీవే (2)
    ప్రభువా నా దేవా ఈ స్తితికే ఆధరమా (2) (నాలోన నీవు)
  3. నాకై మరణించింది నీవే దేవా
    నా పాపం తుడిచింది నీవే ప్రభువా (2)
    శిధిలమైన నన్ను నిలబెట్టింది నీవే
    మధురమైన వాక్యంతో కట్టింది నీవే (2)
    ప్రభువా నా దేవా ఈ స్తితికే ఆధరమా (2) (నాలోన నీవు)

Naalona Neevu Video Song Telugu Christian

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top