Mitruda Rarammu Lyrics in Telugu
మిత్రుడా రారమ్ము
మిత్రుడా రారమ్ము – మైత్రితో పార – మార్థికమైన – మాటల్ వచింతు – మన్ననతో విను
పూర్వ జన్మము నందు – పూర్తిగా పాపిని
అందుకె ఈ బాధ – పొందుచునున్నాను
అని యిట్లు మనస్సులో – అనుకొననే వద్దు
అది నిజమే యైన – అది కూడ పోగొట్టు
రక్షకుడున్నాడు – తత్క్షణమె రమ్ము
ఆయన మానవుడై నట్టి దేవుండు
ఈ మాట నమ్మిన – ఎంత ధన్యుండవు
మనస్సులో ముద్రించు – కొని శాంతి పొందుము
ఈ జన్మమున గూడ – ఎన్నెన్నో పాపాలు
చేసియున్నందున – చివరకు నరకంబె
అని ఆత్మయందున – ఆలోచనెందుకు
అవి సిల్వపై యేసు – అంతరింప జేసె
ఆ వృత్తాంతంబును – ఆనందమున
నమ్మి సుఖముగ నుండుము
సూక్ష్మ మార్గంబిది ఎందరెన్నియన్న
ఏ మాటల్ వినవద్దు దేవ వాక్కె
నిజము – దిక్కులు చూడకు
దివ్య దేవుడు నిన్ను – దీవించును గాక
భూమి చేసిన వాడు – పోషించును గాక
రక్షకుండౌ క్రీస్తు – రక్షించును గాక
పరమ వైద్యుడు స్వస్థ – పరచు చుండును గాక
పనులన్నిని సఫల – పరచు చుండును గాక
దైవాత్మ ధైర్యంబు – తెచ్చు చుండును గాక
అంతాన మోక్షంబు – అందజేయును గాక
విజయము ఈ పాట – విను వారి కామెన్
Mitruda Rarammu Song Details
Song | Mitruda Rarammu / మిత్రుడా రారమ్ము |
Singer | Nagoor Babu (Mano) |
Lyrics | Shri. Devadas Mungamuri |
Music | Jonah Samuel |
Music Label | Jereu Music |