కోత విస్తారత | Kotha Vistharatha Song Lyrics Telugu

కోత విస్తారత | Kotha Vistharatha Song Lyrics Telugu

Telugu Christain Songs Lyrics

కోత విస్తారతను కనలేవా
కనులెత్తి పంటను కోయ చేరవా
సమరయ స్త్రీ సంబరము కనవా
స్వగ్రామమునే తెచ్చెను చూడవా

ప్రభు నీళ్లడిగెను పరామర్శించెను
ఆమె ప్రతి పాపమును తెలిపి కృప చూపెను
పరీక్షించుకొనె తాను కనవా
ప్రక్షాళనకై ప్రభువైపు చూడవా

ప్రభు వివరించెను దేవుడు ఆత్మని
ఆత్మతో సత్యముతో ఆరాధించగా
విగ్రహ ఆరాధనను విడువవా
ప్రతి ప్రతిమను నీలోనుండి త్రోయవా

ప్రభు ప్రకటించెను క్రీస్తు తానే అని
కళ్ళు తెరువబడే కుండ విడువబడే
క్రీస్తేసుని ఊరందరికి చూపవా
కరుణామయిని కనుగొన కదలింపవా

Kotha Vistharatha Video Song Telugu Christian

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top