Skip to content

చితికిన నా బ్రతుకు సాంగ్ | Chithikina Naa Brathuku Song Lyrics Telugu

Chithikina naa brathuku Song Lyrics in Telugu

పల్లవి .చితికిన నా బ్రతుకు మరల చిగురింప చేయుము నలుగుతున్న నాహృదయం
చంకెళ్లు తెంచుము./2

కఠినాత్ముల హృదయములను కరిగించే దేవుడవు. నీవు తప్ప వేరొకరు దేవుడెవరు లేరు ప్రభు.. కరుణ చూపి కాపాడవ మునిగిపోతున్నాను కరుణచూపి కాపాడవ మునిగిపోతున్నాను.. (పల్లవి)

వింటున్న వాక్యములు పదునైనవి నేను చేయు
గాయములు ఘోరమైనవి..
నే వింటున్న వాక్యములు బలమైనవీ
బండభారే నా హృదయం పగులుచున్నది..//2

నలికి కుమిలిపోతున్న ప్రభువా..
ప్రార్థించ లేకున్నా దేవా.
మూగబోయే నా స్వరమును తట్టి..
ప్రార్థించే ధైర్యము నాకిమ్ము.. //2

ఈ మాయలోక మంత్రములకు మారిపోతిని పాపమనే ఊబిలోని మునిగిపోతిని..
అపవాది ఎత్తుగెడకు చిక్కిపోతినీ.
తుదకు నన్ను నేనే నమ్మి మోసపోతిని. //2

దేవా నీ హస్తముతో ముట్టీ.. పరిశుద్ధుల వరసులో నన్నుంచుము. నా పాపము దోషములను తుడిచీ.. మీ ఆత్మతో నన్ను శుద్ది చేయి దేవా //2 ( చితికిన నా బ్రతుకు)

Chithikina naa brathuku Video Song Telugu Christian

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now