Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson
BALAVANTHUDA SONG LYRICS TELUGU
బలవంతుడా ధనవంతుడా గుణవంతుడా నా
యేసయ్యా
నీవంటివాడు లేనేలేడు
నీ సాటి ఎవడు రానేరాడు
నాకున్న ఆధారం – నాలోని ఆనందం నీవే
అ.ప. : యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నా యేసయ్యా
- ఏదియు నీవు లేకుండా కలుగలేదుకదా
దీవెనలు దయచేయగల మహిమ నీదికదా
నాకున్న ఉజ్జీవం – నాలోని ఉత్సాహం నీవే - లోపమన్నది నీయందు కానరాదుకదా
పాపములు క్షమియించగల మనసు
నీదికదా
నాకున్న వైభోగం – నాలోని విశ్వాసం నీవే - శూరుడా నీముందెవడు నిలువలేడుకదా
కార్యములు నెరవేర్చగల ఘనత నీదికదా
నాకున్న సౌందర్యం – నాలోని సామర్ధ్యం నీవే