Anuraagaapoornuda Song Lyrics in Telugu
English Lyrics
పల్లవి: నీకేగా నా స్తుతిమాలిక నీ కొరకే ఈ ఘనవేదిక
నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతిరుగలేదు
మన లేను నే నిన్ను చూడకా
మహా ఘనుడా నా యేసయ్య (నీకేగా)
- సంతోష గానాల స్తోత్రసంపద
నీకే చెల్లింతును ఎల్లవేళల
అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా
నీ గుణశీలత వర్ణింపతరమా”2″
నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
నీవులేని లోకాన నేనుండలేనయ్యా
నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా”2″ (నీకేగా) - నీతో సమమైన బలమైన వారెవ్వరూ
వేరే జగమందు నే ఎందు వెతికినను
నీతిభాస్కరుడా నీ నీతికిరణం
ఈ లోకమంతా ఏలుచున్నదిగా”2″
నా మదిలోన మహారాజు నీవేనయ్య
ఇహపరమందు నన్నేలు తేజోమయ
నీ నామం కీర్తించి ఆరాధింతును”2″ (నీకేగా) - నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
వేరే ఆశేమియు లేదు నాకిలలో
నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా
ఆపాద మస్తకం నీకేగా అంకితం”2″
నా శ్వాస నిస్వాసయు నీవేనయ్యా
నా జీవిత ఆద్యంతం నీవేనయ్యా
నీ కొరకే నేనిలలో జీవింతును”2″ (నీకేగా)