Skip to content

Aa Urilo Sandadi Song Lyrics Telugu

Aa Urilo Sandadi Song Lyrics Telugu

బేత్లెహేములో ఆ ఊరిలో – సందడి
యేసు పుట్టిన ఆ పాకలో – సందడి
మరియ పుత్రుడు ఈ ధరణిలో – సందడి
దేవుని వరము కరుణించెను – సందడి

యూదుల రాజు నేడు పుట్టెను – సందడి
ప్రజలందరికీ వెలుగు కలిగెను – సందడి – 2

ఆడుదాము పాడుదాము ఓరన్నా
లోక రక్షకుడు పుట్టెను చూడన్నా – 2

చరణం: 1
అర్ధ రాతిరి ఆ పాలములో – సందడి
దూత వచ్చినా ఆ గడియలో – సందడి
దూత వార్తతో అ గొల్లలు – సందడి
యేసును చూడ బయలెల్లిరి – సందడి

దావీదు పురములోన రక్షకుడు – సందడి
రేడు జన్మించినాడు దీనుడై – సందడి – (ఆడుదాము)

చరణం: 2
తూర్పు దిక్కున ఆ నింగిలో – సందడి
చుక్క పుట్టెను బహు వింతగా – సందడి
జ్ఞానులందరూ ఆ చుక్కతో – సందడి
బేత్లెహేముకు విచ్చేసిరి – సందడి

బంగారము సాంబ్రాణి బోలము – సందడి
ఆయనకు మ్రొక్కి సమర్పించిరి – సందడి – (ఆడుదాము)

చరణం: 3
ఊరి ఊరికి మా ఊరికి – సందడి
వాడ వాడకు మా వాడకు – సందడి
ఇంటి ఇంటికి మా ఇంటికి – సందడి
పరమ పుత్రుడు దిగి వచ్చెను – సందడి

దివ్య దూతలు పాటలు పాడిరి – సందడి
దేవ దేవుని ఆరాధించుడి – సందడి – (ఆడుదాము)

Aa Urilo Sandadi Video Song Christian

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now