Vithanam Virugakapothe Song Lyrics in Telugu
Telugu Lyrics
విత్తనం విరుగకపోతే – ఫలించునా (2)
కష్టాలే లేకపోతే – కిరీటమే వచ్చునా
అను పల్లవి :
శ్రమలే నా అతిశయం శ్రమలోనే ఆనందం
శ్రమలయందే ఉత్సాహం – విశ్వానమే నా బలం (2)
- పోరాటం దేవునిదైతే – నాకేల ఆరాటం
విశ్వసించి నిలుచుంటేనే
ఇస్తాడు విజయ కిరీటం (2)
గొల్యాతును పుట్టించినదే
దావీదును హెచ్చించుటకే (2)
కిరీటం కావాలంటే
గొల్యాతులు రావొద్దా ? (2)
( శ్రమలే )
- సేవించే మా దేవుడు – రక్షించక మానునా
రక్షించకపోయిన సేవించుట మానము (2)
ఇటువంటి విశ్వాసమే – తండ్రినే తాకునే (2)
అగ్నిలోకి ప్రభువేరాగా – ఏదైన హాని చేయునా (2)
( శ్రమలే )
- ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అధికారులు
శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి (2)
ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే (2)
వాగ్దానం నెరవేరా ఫరోలు రావొద్దా (2)