Skip to content

కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు

కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు

కన్నుల జారిన కన్నీళ్ళు – తడిపెను దేవుని పాదాలు
ఇప్పటి నుండి నీ కళ్ళు – చూచును దేవుని కార్యాలు -,,2,,
ఉందిలే దీవెన – ఎందుకా వేదన
పొందినా యాతన – దేవుడే మరచునా ,,2,,

1) పలుకాకి లోకం నిందించిన
ఏకాకివై నీవు రోదించిన
అవమాన పర్వాలు ముగిసేనులే
ఆనంద గీతాలు పాడేవులే
నవ్వినోళ్ళంత నీ ముందు – తలను వంచేరు ఇకముందు ,,2,,ఉందిలే,,

2)అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన
ఆత్మీయుల ప్రేమ నిదురించిన
అసమానమైన నా దేవుని
బలమైన బాహువు నిను వీడున
యేసు నిలిచాడు నీ ముందు – నీకు చేసేను కనువిందు,,2,,ఉందిలే,,

కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now