నీవే మా ప్రాణమయ్యా యేసయ్య Song Lyrics
సాకీ : నీవే మా ప్రాణమయ్యా
యేసయ్యా
నీవే మా దైవమయ్యా
మా మెస్సయ్యా
నీవే మా ప్రాణమయ్యా
యేసయ్యా
నీవే మా దైవమయ్యా
మెస్సయ్యా “2”
నీకై నీకై నే స్తుతి పాడనా
నిన్నే నిన్నే నే కొనియాడనా “2”
దేవా నిన్నే కీర్తించనా
ప్రభువా నిన్నే ఘనపరచనా
” నీవే మా ప్రాణమయ్యా “
1.మరువవు విడువవు
మా మంచిదేవా
నీ కృపయే మాకు
చాలును ప్రభువా “2”
ఏమివ్వగలమయ్య
యేసయ్య నీ ప్రేమకు
నీవుంటే చాలు ప్రభువా
హాయి యెంతో మా మనసుకు
ఏ స్థితియందైన
నిన్నే సేవించనా
” నీవే మా ప్రాణమయ్యా “
2.నీవే మార్గము,నీవే సత్యము
నీయందే రక్షణ నిత్యజీవము “2”
కన్నులార నీ రూపము
దర్శించు ఆ సమయము
ఆహా! మాకెంత భాగ్యము
అంతులేని ఆనందము
కన్నీటితో నీ పాదాలు
నే కడగనా
” నీవే మా ప్రాణమయ్యా “